దేశ భాషలందు తెలుగు లెస్స. మరి ఇంటర్నెట్ లో మట్టుకు ఎందుకు ఆంగ్లాక్షరాలు ఉపయోగించాలి? ఈ చిన్ని ప్రయత్నం Inscript keyboard నేర్చుకోడానికే.

Tuesday, August 16, 2005

ప్రతి మనిషికి ఏదో ఒక రోజు జీవితం మీద విరక్తి కలుగుతుంది. అంటే నా ఉద్దేశం వెంటనే ఆ సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడని కాదు. కానీ అతని దృక్పథంలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. బీచ్ ఒడ్డున కూర్చొని పిచ్చి చూపులు డెఫినిట్ గా చూస్తాడు.

అలా శూన్యంలోకి చూస్తున్న ప్రశాంత తరుణంలో... త్సునామీ వస్తూందని ఎవరో అరిచేసరికి జీవితం మీద ఆసక్తి పెరిగిపోయి బీచ్ నుండి దూరంగా పరిగెత్తాను.

Wednesday, March 02, 2005

ప్రగాఢ వాంఛ Translation of "Unruly Desire"

ప్రగాఢ వాంఛ (Translation of "Unruly Desire" by Sushma from Sulekha.com CoffeeHouse)

అభిషేకం నీకంట, శనివారమేనంట
ఏ నోట వింటున్నా ఈ మాటనేనంట

నుదుటిపై రేఖలకు తిలకమును సంధించి
పట్టు వస్త్రాలతో పుష్పహారాలతో
ముందుకొస్తావని
నిన్ను చూడాలని

ఎఱ్ఱ చీరనుగట్టి ఎఱ్ఱ గాజులు తొడిగి
కేశములలో సన్నజాజులను ముడిపెట్టి
అధరములు అదరగా
తడియారిబోవగా
ఎదురు చూస్తున్నాను
క్షీరాభిషేకమును
కీర్తించుదామని

ఇన్ని రోజుల ఈ కన్నెఆరాధన
నీ కళ్ళలో నేను కానరావాలనే
నీ వాక్కు మనసులో మ్రోగుతుండాలనే

ఇచ్చితినే నీకు సర్వస్వము

చెదిరిపోయిన మది మిగిలియున్నది చెంత
అర్పించుకుంటాను

అంగీకరించవా
నాతోనె ఉండవా

ఓ వెంకటేశ్వరా...

This is just a translation of Sushma's poem published on Sulekha.com. I am unable to locate the actual link.

Wednesday, February 23, 2005

నెల్లూరంటే నెల్లూరే

నెల్లూరంటే నెల్లూరే

ఎన్ని దేశాలేగినా మరో నెల్లూరు దొరకదే!

వెంకటరమణ విలాస్ లో ఫ్రైడ్ చపాతి,

జైహింద్ స్వీట్స్ లో మలాయి కాజా,

సీమా కేఫ్ లో పొగలు కక్కుతున్న ఛాయ్,

కోమల విలాస్ లో నోరూరించే సాంబార్...

సాయంత్రం అయితే ఏసి బొమ్మ సెంటర్ లో వ్యాహ్యాళి...

గాంధీ బొమ్మ దగ్గర ఆటో వాళ్ళ వేధింపులు...

కనకమహల్ లో దోమల చేత కుట్టించుకుంటూనే చూసే "పాతాళ భైరవి"

"కాంప్లెక్స్" లో శనివారం ఫస్ట్ షో కి వచ్చే అమ్మాయిలు...

ఎటునుంచి చూసినా కనిపించే మైక్రోవేవ్ టవర్,

మూలాపేట లో బొజ్జ గణపతయ్య,

సర్ కాటన్ నిర్మించిన పెన్నార్ ఆనకట్ట,

తిక్కన మహాభారతాన్ని రచించిన ఇల్లు...

తనివి తీరదే... ఎన్ని సార్లు వెళ్ళినా బోరు కొట్టదే...

వి.ఆర్. కాలేజి వద్ద అండర్ బ్రిడ్జ్...

విజయమహల్ రైల్వే గేటు

కొత్తగా కట్టిన చిల్డ్రన్స్ పార్కు...

నశించిపోయిన గాంధీ బొమ్మ పార్కు...

ఇంగ్లీషు సినిమాలు రాని లీలామహల్...

ప్రేమకి ఆకర్షణకి తేడా తెలియని హై స్కూల్ పిల్లలు...

కోడూరు బీచ్ లో జంటల పకపకలు...

సముద్రపుటలల పిచ్చి హోరు...

శతాబ్దాల తరబడి అలాగే ఉంటున్న ట్రాఫిక్ సమస్య...

ఆ సమస్యను మరింత జటిలం చేసిన ఆత్మకూరు బస్ స్టాండ్ ఫ్లై ఓవర్...

నాలుగు లేన్ల హైవే ఫ్రమ్ చెన్నై టు కోల్ కాటా...

జన శతాబ్ది ఫ్రమ్ విజయవాడ టు చెన్నై...

కాలం తో బాటు మార్పులు సహజం...

కానీ అంతరాత్మ అలాగే ఉంది.

నెల్లూరు నాడు ఎలా వెలిగిందో

నేడూ అలాగే చనువిచ్చింది.

:)

About Me

My photo
Just an insignificant addition to the world's population.