తెలుగు లో నా ఆత్మఘోష

దేశ భాషలందు తెలుగు లెస్స. మరి ఇంటర్నెట్ లో మట్టుకు ఎందుకు ఆంగ్లాక్షరాలు ఉపయోగించాలి? ఈ చిన్ని ప్రయత్నం Inscript keyboard నేర్చుకోడానికే.

Tuesday, November 13, 2007

ఒక ప్రయాణం

నేను తెలుగు లో కొంచెం వీక్. కాబట్టి స్పెల్లింగ్ అండ్ గ్ర్యామర్ మిస్టేక్స్ ఎక్కువగా పట్టించుకోవద్దు.
ఇది మధ్య జరిగిన ఒక యథార్థ సంఘటన. ఆఫీస్ లో పని ఎక్కువైపోయిదానికి తోడు ఫోరం లో చాటింగ్ చేస్తూ – 7పీయెమ్ బస్ మిస్ అయ్యాను.
విషయం తెలిసి ఆఫీస్ లోని సాఫ్ట్ వేర్ ఇంజినీయర్స్ అందరు కథకళి ఆడారు
ఆనందం పట్టలెక. (నార్మల్ గా వాళ్ళు 10పీయెమ్ వరకు ఉంటే నేను స్టైలిష్ గా 5:30పీయెమ్ బస్ లో వెళ్ళిపోయేవాదినిటైమ్ మ్యానేజ్మెంట్ మీద లెక్చర్ దంచి.)
నేను వాళ్ల వంక క్రూరం గా చూసి 8:30పీయెమ్ కి ఉన్న నైట్ ట్యాక్సీ బుక్ సేస్కున్నా. ట్యాక్సీ షేరింగ్ బేసిస్ మీద ఇస్తారు. తంచను గా 8:20 కి ట్యాక్సీ కో ఆర్డినేటర్ దగ్గరకి వెళ్ళి – “తిరువాన్మియూర్ RTO కాడకెళ్లాలిఅన్నాను.
అతను తల పంకించి “2239” అన్నాడు.

“2239 ఏంటిఅని అడిగాను అర్థం కాక. వాడు నా వంక విచిత్రంగా చూసాడు. “ఫర్స్ట్ టైమా నైట్ ట్యాక్సీ ఎక్కడం?” అని అడిగాడు. తల గబా గబా ఊపేశాను.
“2239
అనేది ట్యాక్సీ నంబర్ ప్లేట్ నంబర్. వెతుక్కోని కూర్చో.”
నేను తల తిప్పి అక్కడున్న 25 ట్యాక్సీ లను చూశాను. ఇప్పుడు వాటి నంబర్ ప్లేట్స్ అన్నీ వెతుక్కుంటూ వెళ్ళాలన్న మాట నేను. ఇంతలో నాతో బాటు 2239 లో వెళ్లాల్సిన మరో శాల్తి వచ్చింది.
నువ్వు అటు వైపు నుంచి నరుకు. నేను ఇటు సైడ్ నుండి స్క్యాన్ చేస్తాఅన్నాడు.
సరే అని ఇద్దరం ఒక్కో కొన నుండి బయలుదేరాము. ప్రతి టాటా సుమో దగ్గర ఆగి వంగి నోకియా 1100 లో ఉన్న టార్చ్ వెలిగించి నంబర్ చూసుకుంటూ కదిలాము.
ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఏడు, ఎనిమిది, పది, పదకొండు, పన్నెండు… “యూరేకాఅని అరవాలనిపించింది కనిపించగానే. అవతల సైడ్ నుండి నరుక్కొస్తున్న పెద్ద మనిషి కూడా ఎగ్స్యాక్ట్లీ అదే టైమ్ లో వచ్చి తలాడించాడు.
మర్ఫీస్ లాఅన్నాడు.
నేను ఒప్పుకున్నాను. ఇద్దరం వెళ్ళి ఆశీనులము అయ్యాము టాటా సుమో లో. కాసేపటి తర్వాత ఒక అమ్మాయి వచ్చిందిరాజ కీల్పాక్కం వెళ్తుందా?” అని అడిగింది.
అదెక్కడుందో నాకు తెల్వదు.” అన్నాను కామ్ గా.
అదేసేలైయూర్ పక్కనే ఉంటుంది.” అనింది అమ్మాయి.
ఆది కూడా తెల్వదుఅన్నా. ఆమె నన్ను ఒక పిచ్చి కుక్క ని చూసినట్లు చూసి పక్కన కూర్చొని ఐపోడ్ లో సత్ప్రవర్తనా సూక్తులు వింటున్న పెద్ద మనిషి ని అడిగింది.

హెల్లొ! ఇది రాజకీల్పాక్కం వెళ్తుందా?”
…..
హెల్లొ
…..
అంతలోపల ట్యాక్సీ డ్రైవర్ వచ్చాడు అక్కడికి. “ఏడకెళ్ళాలమ్మ నువ్వు?”
రాజకీల్పాక్కంఅని ఆశగా అడిగింది అమ్మాయి.
వెళ్తాది. కూర్సోండి.” అన్నాడు.
సరే అని ముగ్గురం సెటిల్ అయ్యాము బండిలో.
నెమ్మది గా కదిలింది. సెక్యూరిటీ గేట్ క్రాస్ అవుతున్నప్పుడు ఐపోడ్ ఆఫ్ చేశాడు మన హీరో. బ్యాటరీస్ పొదుపు చేస్తున్నాడనుకుంటా. అదే చాన్స్ అని అడిగా. “RTO నా?”
కాదు. మేడవాక్కం అండ్ రాజకీల్పాక్కం మద్య.”
మేడవాక్కం ఎక్కడుంది?” అని అడిగాను.
అదికూడా తెలియదా? పళ్లింకరణై పక్కన ఉంది కదా?”
నేను కాసేపు బుర్ర గోక్కుని మనకెందుకొచ్చిన గొడవలే అని సైలెంట్ అయిపోయాను. అరగంట తర్వాత సడన్ గాలెఫ్ట్ ఇక్కడఅని అరిచింది అమ్మాయి.
డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి లెఫ్ట్ కి తిప్పబోయాడు. అక్కడ గోడ తప్పితే ఏమీ లేదు. “ఎక్కడ?” అని అడిగాడు.
దాటేసాము. వెనక్కి వెళ్లాల
డ్రైవర్ మాకేవ్వరికి వినిపించకుండా ఏంటో గొణుక్కొని సుమో రివర్స్ లో తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఒక చీకటి గుయ్యారం లాంటి సందులో తిప్పాడు.
భారతి ఎలిమెంటరీ స్కూల్ ఎరుకా? దాని పక్క సందు.” చెప్పింది అమ్మాయి.
భారతి ఎలిమెంటరీ స్కూల్? అదెక్కడుందండి?” అడిగాడు డ్రైవర్.
చాలా ఫేమస్ స్కూల్. నా పక్కింటి పాప కూడా అక్కడే చదువుతుంది. తెలియదా?” ఆమె ఆశ్చర్యంగా అడిగింది.
తెలియదు మేడమ్. మీకు రూట్ తెలుసా?” అడిగాడు డ్రైవర్.
సరేస్ట్రేట్ వెళ్లిపో

సుమో స్ట్రేట్ వెళ్లిపోయింది. అలా చాలా సేపు వెళ్లాక నేను చుట్టూ పక్కల ఏమున్నాయా అని చూశాను. ఏమీ కనపడలేదు. దారి మాత్రం ఇరుకై పోతూ ఉంది. చెయ్యి బయటకు పెట్టలేని పరిస్థితి.
డ్రైవర్ సడన్ గా సుమో ని ఆపాడు. “సర్, కొంచెం సైడ్ మిరర్ క్లోస్ చేస్తారా? విరిగిపోతాయేమో!”
సైడ్ మిరర్స్ లోపలకి వంచేసి మళ్లీ బయలుదేరాము.
ఈడ రైట్ కొట్టు
రైట్ అనేది ఒకనేనుపిల్ల కాలువకి అవతల సైడ్ ఉంది. కాలువలో మురికి నీరు సెలయేరు లాగా పారుతూ ఉంది.
డ్రైవర్ మళ్లీ గొణిగి సుమో ని జాగ్రత్త గా రైట్ కి తిప్పాడు.
లెఫ్ట్ ఇక్కడ
లెఫ్ట్ లో ఏమీ కనిపించలేదు. కొన్ని శునకాలు మాత్రం సేద తీరుతున్నాయి.
కుక్కలున్నాయి చూడు. దాటి వెళ్లాల.”
డ్రైవర్ హార్న్ కొట్టాడు. అవి ఏమీ పట్టించుకోలేదు.
సార్. మీరు కఱ్ఱ పట్టుకోండి. నేను రాయి విసురుతా. మీరు వాటిని తరిమేయ్యండిఅన్నాడు డ్రైవర్ ఆశగా నా సైడ్ చూస్తూ.
నేనొక చిరునవ్వు నవ్వి – “రాయెత్తి కొట్టేది నేను. కఱ్ఱతో తరిమేది నువ్వు.” అన్నాను.
ఫైనల్ గా ఇద్ధరం సుమో నుంచి దిగాము. మేము ఇలా దిగగానేఅన్ని కుక్కలు లేచి మా సైడ్ గ్యాలప్ వెయ్యడం మొదలెట్టాయి. మేము రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ సూమోలోకి గబ గబా దూరిపోయాం.
అలా వే క్లియర్ అయ్యిందన్నమాట. కుక్కలు మళ్లీ సెటిల్ అయ్యేలోగా సుమోని సందులోకి తిప్పేసాము. అలా మరొక 15 మినిట్స్ సందులూ గొందులు గాఢాంధకారంలో తిరిగి చివరకి భారతి ఎలిమెంటరీ స్కూల్ అనబడే పూరి పాక ముందు ఆగాము.
ఇదేనా స్కూల్ మీరు చెప్పిన ఫేమస్ స్కూల్?” డ్రైవర్ గొంతులో వెటకారం బాగా ధ్వనించింది. అమ్మాయి మాత్రం అదేమీ పట్టించుకోకుండా – “ఇక్కడ నుండి నేను వెళ్తాలేఅని చెప్పి దిగింది.
బ్రతుకు జీవుడా అని ఇంకో ట్వెంటి మినిట్స్ కష్ట పడి మెయిన్ రోడ్ మీదకి వచ్చాము.
ఐపోడ్ హీరొ అప్పుడు కళ్ళు తెరిచి – “ఏంటి ఇంకా మేడవాక్కం రాలేదా??” అని హాశ్చర్యంగా అడిగాడు.
నేనొక వెర్రి నవ్వు నవ్వి – “వస్తే లేపుతాలే.. నువ్వు నిద్రపోఅని చెప్పాను.
దేవుని దయ వలనఐపోడ్ ఇల్లు మెయిన్ రోడ్ మీదనే ఏడిసింది.
అక్కడ నుండి మరొక అరగంట ప్రయాణించి తిరువాన్మియూర్ లో దిగానునైట్ 11 కి.
అమ్మాయి పేరు మాత్రం మైండ్ లో బాగా నోట్ చేసుకున్నానెక్స్ట్ టైమ్ నుండి ట్యాక్సీ లో అమ్మాయి కనిపిస్తేదిగి నెక్స్ట్ ట్యాక్సీ లో వెళ్దామని డిసైడ్ అయిపోయా.

About Me

My photo
Just an insignificant addition to the world's population.