ఇశాన్ వేదం ఇప్పుడు మన మధ్య లేడు. క్యాన్సర్ ఎక్కువ బాధ పెట్టకుండా వాడిని దేవుడి దగ్గరకి తీసుకెళ్లిపోయింది. వాడు మాతో ఉన్నది సంవత్సరము పైన ఆరు నెలలు. కానీ వాడి జ్ఞాపకాలు జీవితాంతం మమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి.
"ఇలా ఎందుకు జరిగింది?" అనే ప్రశ్నకు సమాధానం మాకు ఎప్పటికీ దొరకదు. భగవంతుని లీలలు అర్థం చేసుకొనే మేధస్సు మాకు లేదు. మాకు ఖచ్చితంగా తెలిసిన విషయం ఒక్కటే. ఆయన ఏమీ చేసినా దానికో పరమార్థం ఉండే ఉంటుంది.
ఇశాన్ ఒక విధంగా ఇంకా బ్రతికే ఉన్నాడు. తన అవయవాలను దానం ఇచ్చి నలుగురికీ వారి జీవితంలో మరువలేని సహాయం చేశాడు. మాస్టర్ శౌర్య తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో అతి చిన్న అవయవ దాత అయ్యాడు. మహోన్నత శిఖరాలని అధిగమించాడు ఒక అసాధారణ వ్యక్తిగా.
వాడు మాకు చాలా జీవిత సత్యాలు నేర్పాడు. మరణం అనేది కేవలం ఒక మార్పు మాత్రమే అని చెప్పాడు. ఇక ముందు మాకు ఎటువంటి కష్టాలైనా చిన్నవిగానే కనిపించేటట్లు చేశాడు. డబ్బు ఎందుకు పనికిరాదు అని విడమార్చి బోధించాడు. (అమెరికా లో చికిత్స చేయించగల స్థోమత ఉండి కూడా అందుకు వ్యవధి లేని పరిస్థితి).
రేయ్, నువ్వు లేని లోటు ఎప్పటికీ తీరదు. కానీ మేము నీ తల్లి తండ్రులం అని గర్వంగా చెప్పుకునే అవకాశం కల్పించావు. మాతో నువ్వు గడిపిన మధుర క్షణాలు మేము ఎన్నడూ మరువలేము. మళ్లీ నీకు ఎప్పుడన్నా ఈ లోకానికి రావాలనిపిస్తే నీకు స్వాగతం చెప్పడానికి మేము ఎప్పుడూ ఎదురుచూస్తూనే ఉంటాము.
ఇట్లు
వేణు
దేశ భాషలందు తెలుగు లెస్స. మరి ఇంటర్నెట్ లో మట్టుకు ఎందుకు ఆంగ్లాక్షరాలు ఉపయోగించాలి? ఈ చిన్ని ప్రయత్నం Inscript keyboard నేర్చుకోడానికే.
Monday, November 12, 2007
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
I read about your son today in IBDB. I salute you and your wife for the wonderful and noble deed you have done. I am really sorry for your loss. In a way, Ishaan is still living among us. Hats off to both of you.
మీ గొప్ప మనసుకి చేతులెత్తి నమస్కరించాలి. తను వెళ్ళిపోయినా తల్లిదండ్రులకి గర్వపడే అవకాశం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఎన్నాళ్ళు బ్రతికేమన్న దానికన్నా ఎంత గొప్పగా బ్రతికేమన్నదే చూడాలిగా. ఎన్నాళ్ళు మనల్ని గుర్తుంచుకున్నారు అనేదే కదా జీవితం. చిరకాలం చిరంజీవిగా గుర్తుంటాడు. ఇశాన్ మరో రూపం లో మీ దంపతుల జీవితం లో ప్రవేశించాలని మనసా వాచ కర్మణ భగవంతుని ప్రార్దిస్తున్నా.
ఏ ధనిక తండ్రో అయితే కొడుకులకి ఆస్థులు, సామ్రాజ్యాలు ఇస్తారు. ధనం లేనివాడు బ్రతకటానికి సరిపోయే ఏదో విద్యని ఇస్తాడు. కానీ కొడుకు జీవితానికి శాశ్వతత్వాన్ని కల్పించిన మీకు ఏవిధంగా అభినందించాలో తెలియటంలేదు. తమకి ఇంకా సంతానం ఉందా? వీలయితే నాకు ఒక మెయిల్ తప్పక పెట్టండి. ఇశాన్ ఫోటోలు ఇంకొన్ని పెట్టాల్సింది. I just read http://www.venuvedam.com/
muralidhar.namala@gmail.com
Post a Comment