నెల్లూరంటే నెల్లూరే
ఎన్ని దేశాలేగినా మరో నెల్లూరు దొరకదే!
వెంకటరమణ విలాస్ లో ఫ్రైడ్ చపాతి,
జైహింద్ స్వీట్స్ లో మలాయి కాజా,
సీమా కేఫ్ లో పొగలు కక్కుతున్న ఛాయ్,
కోమల విలాస్ లో నోరూరించే సాంబార్...
సాయంత్రం అయితే ఏసి బొమ్మ సెంటర్ లో వ్యాహ్యాళి...
గాంధీ బొమ్మ దగ్గర ఆటో వాళ్ళ వేధింపులు...
కనకమహల్ లో దోమల చేత కుట్టించుకుంటూనే చూసే "పాతాళ భైరవి"
"కాంప్లెక్స్" లో శనివారం ఫస్ట్ షో కి వచ్చే అమ్మాయిలు...
ఎటునుంచి చూసినా కనిపించే మైక్రోవేవ్ టవర్,
మూలాపేట లో బొజ్జ గణపతయ్య,
సర్ కాటన్ నిర్మించిన పెన్నార్ ఆనకట్ట,
తిక్కన మహాభారతాన్ని రచించిన ఇల్లు...
తనివి తీరదే... ఎన్ని సార్లు వెళ్ళినా బోరు కొట్టదే...
వి.ఆర్. కాలేజి వద్ద అండర్ బ్రిడ్జ్...
విజయమహల్ రైల్వే గేటు
కొత్తగా కట్టిన చిల్డ్రన్స్ పార్కు...
నశించిపోయిన గాంధీ బొమ్మ పార్కు...
ఇంగ్లీషు సినిమాలు రాని లీలామహల్...
ప్రేమకి ఆకర్షణకి తేడా తెలియని హై స్కూల్ పిల్లలు...
కోడూరు బీచ్ లో జంటల పకపకలు...
సముద్రపుటలల పిచ్చి హోరు...
శతాబ్దాల తరబడి అలాగే ఉంటున్న ట్రాఫిక్ సమస్య...
ఆ సమస్యను మరింత జటిలం చేసిన ఆత్మకూరు బస్ స్టాండ్ ఫ్లై ఓవర్...
నాలుగు లేన్ల హైవే ఫ్రమ్ చెన్నై టు కోల్ కాటా...
జన శతాబ్ది ఫ్రమ్ విజయవాడ టు చెన్నై...
కాలం తో బాటు మార్పులు సహజం...
కానీ అంతరాత్మ అలాగే ఉంది.
నెల్లూరు నాడు ఎలా వెలిగిందో
నేడూ అలాగే చనువిచ్చింది.
:)