ప్రతి మనిషికి ఏదో ఒక రోజు – జీవితం మీద విరక్తి కలుగుతుంది. అంటే నా ఉద్దేశం వెంటనే ఆ సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడని కాదు. కానీ అతని దృక్పథంలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. బీచ్ ఒడ్డున కూర్చొని పిచ్చి చూపులు డెఫినిట్ గా చూస్తాడు.
అలా శూన్యంలోకి చూస్తున్న ప్రశాంత తరుణంలో... త్సునామీ వస్తూందని ఎవరో అరిచేసరికి జీవితం మీద ఆసక్తి పెరిగిపోయి బీచ్ నుండి దూరంగా పరిగెత్తాను.