దేశ భాషలందు తెలుగు లెస్స. మరి ఇంటర్నెట్ లో మట్టుకు ఎందుకు ఆంగ్లాక్షరాలు ఉపయోగించాలి? ఈ చిన్ని ప్రయత్నం Inscript keyboard నేర్చుకోడానికే.

Friday, December 24, 2004

బీచ్ గోల

ఆకాశం భూమిని ముద్దుపెట్టుకున్న చోట, మామిడాకును వదల్లేక వదల్లేక కిందకు జారుతున్న నీటి బిందువులా సూర్యుడు అస్తమించడానికి సన్నాహితుడవుతున్నాడు.

అలలు మాత్రం నిర్విరామంగా తాళంకి అనుగుణంగా అలుపు సొలుపు లేకుండా సాగరతీరాన్నికొడుతున్నాయి.

నాకు నవ్వొచ్చింది. యద్దనపూడి గారి నవలలు ఎక్కువ చదివి బీచ్ లో కూర్చుంటే ఇలాగే నవలాశైలిలో పరిగిస్తాయి ఆలోచనలు. పక్కన బఠానీల వాడు చురుకుగా బీచ్ అంతా పరీక్షిస్తున్నాడు జంటలు ఎవరన్నా కనిపిస్తారేమోనని. జంటపక్షులు ఐదు నిమిషాల ఏకాంతం కోసం ఐదు రూపాయలు పెట్టి బఠానీలు కొనగలరనే సిద్ధాంతాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం అతని వ్యాపార దక్షతకు నిదర్శనం.

నాకు మళ్ళీ నవ్వొచ్చింది. కొద్ది రోజులక్రింతం నేను కూడా ఒక ఐదు రూపాయలు వదిలించుకోవాల్సి వచ్చింది నిస్సహాయంగా! కొనకపోతే అస్సలు వదలరే వీళ్ళు!! మార్కెటింగ్ ఫీల్డ్ లో పనిచేసే నాకు, ఈ సముద్రపు గట్టు వ్యాపారికి ఎన్నో పోలికలు కనిపిస్తాయి. మేము ఒక ఇస్త్రీ చొక్కా ఒక సూటు వేసుకొని ఎదుటివాడి అవసరాన్ని మాకు తగినట్లుగా మార్చి సరుకులు అమ్ముతాము. వీడు ప్రేమజంట అనే కాంసెప్ట్ లో ఉన్న ఒక చిన్న లూప్ హోల్ ని ఉపయోగించి తన ప్రాడక్ట్ ని అమ్ముతాడు.

ఆరు గంటలయ్యింది. ఇంటికి వెళ్ళాలనిపించలేదు. బఠానీలవాడు నా వంక అదోలా చూసాడు. వారం ముందుటి వరకు ప్రతిరోజు జంటగా వచ్చి ఇప్పుడేంటో దేవదాసు టైపులో ఒంటరిగా కూర్చొని యద్దనపూడి రీతిలో ఆత్మవిమర్శనం చేసుకుంటున్నాడని ఆలోచిస్తూ ఉండొచ్చు బహూశా.

ముచ్చటగా మూడోసారి నవ్వొచ్చింది నాకు. మా అభిరుచులు కలవవట, కాబట్టి విడిపోవాలంట. ఎంత సులువుగా అనేసింది? ఆమెకేం! ఇంట్లో బామ్మ, తాతయ్య, అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలు ఉన్నారు... వారికోసం నన్ను వదలాలంటే పెద్ద పని కాదు. కాని నాకు? ఒక పేరుకోసం మామయ్య తప్పితే రక్త సంబంధీకులని చెప్పుకోడానికి ఎవ్వరూ లేరు.

ఈసారి బఠానీలవాడు నవ్వాడు. "సార్, ఏంటి ఒంటరిగా కూర్చున్నారు?" వీడిక్కూడా కావాల్సివచ్చింది నా జీవితగాథ. తల అడ్డంగా ఆడించాను. "తెలుగువాళ్ళు ఇక్కడికి చాలా తక్కునగా వస్తారు సార్... బఠానీలు కావాలా?" ఈ సంభాషణ ఎటునుంచైనా తిరిగీ బఠానీలకే వస్తుందని తెలిసినా అతని అప్రోచ్ ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. మార్కెటింగ్ లో పర్సనల్ డీటైల్స్ ద్వారా ముందుకు దూసుకెళ్ళడం ఒక ప్రక్రియ. ఇతను హార్వార్డ్ లో చదవలేదేమోగాని, లోకాన్ని మాత్రం క్షుణ్ణంగా చదివాడు.

"నా పాప తనని మర్చిపొమ్మంటుందోయ్! ఏం చెయ్యమంటావ్?" అడిగాను రెండు రూపాయల బఠానీలు నములుతూ.

"మర్చిపోండి సార్. బాంబే లో అమ్మాయిలు తక్కువా? అయినా మీకేంటి సార్... విక్టరీ వెంకటేష్ లాగా ఉంటారు. ఈ బీచ్ లో కూర్చొని అలా సూర్యుడిని చూస్తే బాధగానే అనిపిస్తుంది. క్లబ్బులు డిస్కోలు ఉంటాయిగా... వెళ్ళండి. తాగండి... ఏదో పిల్ల దొరక్కుండా పోదు."

తల అడ్డంగా ఆడించాను. "నాకు ఏదో పిల్ల ఒద్దురా.. ఆ పిల్లే కావాలి."

అతను నన్ను పిచ్చాసుపత్రి నుండి తప్పించుకొని వచ్చిన ఒక మహామేధావి వంక చూసినట్లు చూసాడు. "ఇక్కడ కూర్చొని అలలను చూస్తే ఆమె దొరుకుతుందా బాబు? అయినా రోజూ బీచ్ లో పడి మాట్లాడుతారు. ఎప్పుడన్నా అది కాక ఇంకేమన్నా చేసారా? పాపం ఆ పిల్ల కి బోర్ కొట్టి ఉంటుంది."

నన్నెవరో కొట్టినట్లనిపించింది. ఆత్మవిమర్శనం, యద్దనపూడి నా జీవితంలో కావలసినదాని కంటే కొంచెం ఎక్కువయ్యాయేమో.. సుమన్ అందుకే విడిపోవాలనుకొందేమో...

బఠానీల వాడికో పది రూపాయలు ఇచ్చి బస్ స్టాప్ వైపు కదిలాను... మరో సారి సుమన్ తో మాట్లాడాలని.. ఈ సారి బీచ్ లో మాత్రం కాదు!

5 comments:

batasari said...

Baagundhi saar... bhaashaa bhedam lekundaa mee praaveenyatha choopisthunnaaru :)

Anonymous said...

World Of Warcraft gold for cheap
wow power leveling,
wow gold,
wow gold,
wow power leveling,
wow power leveling,
world of warcraft power leveling,
wow power leveling,
cheap wow gold,
cheap wow gold,
maternity clothes,
wedding dresses,
jewelry store,
wow gold,
world of warcraft power leveling
World Of Warcraft gold,
ffxi gil,
wow account,
world of warcraft power leveling,
buy wow gold,
wow gold,
Cheap WoW Gold,
wow gold,
Cheap WoW Gold,
wow power leveling
world of warcraft gold,
wow gold,
evening gowns,
wedding gowns,
prom gowns,
bridal gowns,
oil purifier,
wedding dresses,
World Of Warcraft gold
wow gold,
wow gold,
wow gold,
wow gold,
wow power level,
wow power level,
wow power level,
wow power level,
wow gold,
wow gold,
wow gold,
wow po,
wow or,
wow po,
world of warcraft gold,
cheap world of warcraft gold,
warcraft gold,
world of warcraft gold,
cheap world of warcraft gold,
warcraft gold,buy cheap World Of Warcraft gold
Maple Story mesos,
MapleStory mesos,
ms mesos,
mesos,
SilkRoad Gold,
SRO Gold,
SilkRoad Online Gold,
eq2 plat,
eq2 gold,
eq2 Platinum,
EverQuest 2 Platinum,
EverQuest 2 gold,
EverQuest 2 plat,
lotro gold,
lotr gold,
Lord of the Rings online Gold,
wow powerleveling,
wow powerleveling,
wow powerleveling,
wow powerleveling,world of warcraft power leveling
ffxi gil,ffxi gil,ffxi gil,ffxi gil,final fantasy xi gil,final fantasy xi gil,final fantasy xi gil,final fantasy xi gil,world of warcraft gold,cheap world of warcraft gold,warcraft gold,world of warcraft gold,cheap world of warcraft gold,warcraft gold,guildwars gold,guildwars gold,guild wars gold,guild wars gold,lotro gold,lotro gold,lotr gold,lotr gold,maplestory mesos,maplestory mesos,maplestory mesos,maplestory mesos, maple story mesos,maple story mesos,maple story mesos,maple story mesos,
k3p6q7ym

Anonymous said...

World Of Warcraft gold for cheap
wow power leveling,
wow gold,
wow gold,
wow power leveling,
wow power leveling,
world of warcraft power leveling,
world of warcraft power leveling
wow power leveling,
cheap wow gold,
cheap wow gold,
buy wow gold,
wow gold,
Cheap WoW Gold,
wow gold,
Cheap WoW Gold,
world of warcraft gold,
wow gold,
world of warcraft gold,
wow gold,
wow gold,
wow gold,
wow gold,
wow gold,
wow gold,
wow gold
buy cheap World Of Warcraft gold y3c6j7oi

Anonymous said...

runescape money runescape gold as runescape money buy runescape money runescape gold runescape gold runescape money buy runescape money runescape money runescape gold wow power leveling wow powerleveling Warcraft Power Leveling Warcraft PowerLeveling buy runescape gold buy runescape money runescape itemsrunescape accounts runescape gp dofus kamas buy dofus kamas Guild Wars Gold buy Guild Wars Gold lotro gold buy lotro gold lotro gold buy lotro gold lotro gold buy lotro gold runescape money

Unknown said...

Venu Vedam గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.

About Me

My photo
Just an insignificant addition to the world's population.